JAGADABHIRAMA ON SARVABHUPALA _ సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభయం
TIRUPATI, 23 MARCH 2023: As part of the ongoing annual Brahmotsavam at Tirupati Sri Kodandarama swamy temple, on the fourth day evening on Thursday, Sri Ramachandra Murthy flanked by Sita Devi and Sri Lakshmana Swamy on His either sides, blessed devotees on the beautifully decked Sarvabhupala Vahanam. Both the senior and junior pontiffs of Tirumala, DyEO Smt Nagaratna, AEO Sri Mohan, Kankanabhattar Sri Anandakumar Dixitulu and others participated.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభయం
తిరుపతి, 2023 మార్చి 23: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి ప్రారంభమైన స్వామివారి వాహన సేవ ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఏఈవో శ్రీ మోహన్, కంకణబట్టర్ శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.