SARVABHOOPALA AT CHENNAI _ స‌ర్వ‌భూపాల వాహ‌నంపై శ్రీ పార్థ సార‌ధిస్వామి అలంకారంలో సిరుల‌త‌ల్లి

TIRUPATI, 22 FEBRUARY 2025: The ongoing annual fete in Sri Padmavati Ammavari temple at Chennai witnessed the Goddess taking ride on Sarvabhoopala vahanam on Saturday blessings devotees.

AEO Sri Parthasaradhi and other office staff were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స‌ర్వ‌భూపాల వాహ‌నంపై శ్రీ పార్థ సార‌ధిస్వామి అలంకారంలో సిరుల‌త‌ల్లి

చెన్నై / తిరుపతి, 2025 ఫిబ్రవరి 22: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ‌నివారం ఉద‌యం 9 గంట‌లకు స‌ర్వ‌భూపాల వాహ‌నంపై శ్రీ పార్థ‌సార‌ధిస్వామి అలంకారంలో అమ్మ‌వారు భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు.

శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 23వ తేదీన ఉదయం సూర్య‌ప్ర‌భ వాహ‌నం, రాత్రి చంద్ర‌ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.