సర్వభూపాల వాహనసేవలో సాంస్కృతిక వైభవం
సర్వభూపాల వాహనసేవలో సాంస్కృతిక వైభవం
తిరుమల, 2023 సెప్టెంబరు 21: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి సర్వభూపాల వాహనసేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.
హైదరాబాదుకు చెందిన సంతోశ్ బృందం పేర్ని నృత్యం, తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాలకు చెందిన కళాకారులు మోహినీయట్టం, దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులు జానపద నృత్యం, హైదరాబాద్‌కు చెందిన నాగార్జున బృందం థింసా నృత్యం, భద్రాచలానికి చెందిన అర్జున్ బృందం కొమ్ముకొయ్య, హైదరాబాద్‌కు చెందిన పార్థసారథి బృందం భరతనాట్యం, కవిత బృందం బోనాల కోలాటం, తెలంగాణకు చెందిన రాము బృందం బిందెల బంజార నృత్యం ఆకట్టుకున్నాయి. అదేవిధంగా, హైదరాబాద్‌కు చెందిన పి.వి.కె.కుందనిక బృందం కూచిపూడి, విశాఖపట్నంకు చెందిన సునిత బృందం దేవీనృత్యం, హైదరాబాద్‌కు చెందిన శాంతి దుర్గా బృందం కోలాటం అలరించాయి. మొత్తం 11 కళాబృందాల్లో 254 మంది కళాకారులు పాల్గొన్నారు.
టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.