సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడి వైభవం
సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడి వైభవం
తిరుమల, 2022 ఫిబ్రవరి 08: రథసప్తమి సందర్బంగా మంగళవారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై అనుగ్రహించారు. ఈ వాహన సేవలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు.
సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి, టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీ రాములు, శ్రీ మధుసూదన్ యాదవ్, శ్రీ మారుతి ప్రసాద్, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు ఈ వాహన సేవలో పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.