TTD CLARIFICATION _ సాక్షి ఛానెల్లో ప్రసారమైన ”తిరుమల లో తన్నుకున్న టీటీడీ సిబ్బంది” అనే వార్త ను టీటీడీ ఖండిస్తోంది. ఇది పూర్తిగా వాస్తవదూరం.
Tirumala, 02 July 2025: The Tirumala Tirupati Devasthanams strongly refuted the report aired by Sakshi TV titled “TTD staff involved in physical fight in Tirumala”, stating that the report is completely baseless and far from the truth.
On June 29, in the afternoon near Akhilandam at Tirumala, a group of unauthorized photographers were taking pictures without any official license, causing a lot of inconvenience to the pilgrims.
In response, a private security guard on duty questioned one such photographer. The photographer handed the camera to someone else and refused to retrieve it when asked by the guard. This led to a verbal altercation in which the photographer used abusive language at the Security.
The argument escalated, and both of them were later seen continuing the dispute near Shop No. 96 at Asthana Mandapam. The incident has been captured on CCTV.
A clarification has been sought from the photographer working at Shop No. 96 (Photo Studio) regarding his inappropriate behavior.
Simultaneously, the private security guard was found to have violated disciplinary protocols. Accordingly, he has been relieved from duty in Tirumala and transferred to Tirupati.
While these are the actual facts, misrepresenting and sensationalizing the incident through false reporting is highly condemnable.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సాక్షి ఛానెల్లో ప్రసారమైన ”తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బంది” అనే వార్తను టీటీడీ ఖండిస్తోంది. ఇది పూర్తిగా వాస్తవ దూరం.
తిరుమల, 2025 జూలై 02: జూన్ 29వ తేది మధ్యాహ్నం తిరుమల లోని అఖిలాండం వద్ద ఎటువంటి లైసెన్స్ లేకుండా అనధికారికంగా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో అక్కడే విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు సదరు ఫోటోగ్రాఫర్ ను ప్రశ్నించిన క్రమంలో కెమెరాను వేరే వారికి ఇచ్చి పంపినందుకు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కెమెరా ను తెప్పించమన్నందుకు ఫోటోగ్రాఫర్ అసభ్యకరమైన భాషను సిబ్బందిపై వాడటం, ఒకరినొకరు మాట మాట పెంచుకొని గొడవ పడినట్టుగా తెలిసింది.
గొడవను పెంచుకుంటూ ఇద్దరు ఆస్థాన మండపంలొని షాపు నంబర్: 96 వద్ద గొడవపడిన విషయం సీసీ కెమెరాలో రికార్డైంది.
ఈ ఘటనలో షాప్ నెంబరు: 96, (ఫోటో స్టూడియో) లో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్ ను తాను ప్రవర్తించిన తీరు పై వివరణ కోరడమైనది.
అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ప్రవర్తించిన తీరు నియమాలకు విరుద్ధంగా ఉండడంతో అతనిని తిరుమల నుండి విధుల నుంచి తప్పించి తిరుపతికి పంపించడం జరిగింది.
వాస్తవాలు ఇలా ఉండగా ఈ ఘటనను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం భావ్యం కాదు.