CHANGES IN VIP DARSHAN AND ARJITA SEVAS FOR THE COMMON DEVOTEES BENEFIT _ సామాన్యభక్తుల సౌలభ్యం కోసం ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు – టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirumala,20 May 2023: In the backdrop of a heavy summer vacation rush in Tirumala after almost three years post relaxation of Covid restrictions, TTD has made certain changes till June 30, said TTD Chairman Sri YV Subba Reddy in a statement released on Saturday evening.

 

It is taking nearly 30-40 hours for Darshan to tokenless devotees due to the heavy summer rush.

 

TTD has introduced some changes till June 30 in VIP Break Darshan and Arjita Sevas.

 

TTD has withdrawn the discretionary quota in Suprabata Seva on Friday, Saturday and Sunday saving 20 minutes for common devotees

 

Similarly, TTD has decided to perform Tiruppavada Seva on Thursdays in Ekantam thereby saving 30 minutes.

 

It’s also been decided not to accept VIP recommendation letters on Fridays, Saturdays and Sundays but allow break Darshan for only self-VIPs which will save 3 hours of Darshan time on each of these days.

 

These decisions will be implemented keeping in view the common devotees providing them with comfortable and quick Srivari Darshan avoiding long waiting lines and time.

 

TTD has appealed to all devotees and VIPs to cooperate and give opportunity for all devotees to have comfortable Srivari Darshan.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సామాన్యభక్తుల సౌలభ్యం కోసం ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు – టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌, 2023 మే 20: కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్యభక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామివారి సేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

– శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేయడం జరిగింది. తద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుంది.

– గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది.

– శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదు. కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది. తద్వారా ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుంది.

క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం అవుతుంది.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని శ్రీ వైవి.సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.