SOMASKANDAMURTHY ON SIMHA VAHANA _ సింహ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి

Tirupati, 6 Mar. 21: Sri Somaskandamurthy took a celestial ride on Simha Vahana as a part of the ongoing annual brahmotsavam in Kapileswara Swamy temple at Tirupati on Saturday evening.

However, the vahana Seva was observed in Ekantham in view of Covid-19 restrictions.

DyEO Sri Subramanyam and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సింహ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి

తిరుపతి, 2021 మార్చి 06: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన శ‌నివారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి సింహ వాహనంపై అభ‌య‌మిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు. మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్రమృగాల భయం ఉండదు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.