SRI KALYANA VENKATESWARA SWAMY BLESSES ON SIMHA _ సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామి

Tirupati, 20 February 2025: The ongoing annual fete at Srinivasa Mangapuram witnessed Sri Kalyana Venkateswara Swamy, on Simha Vahana blessing His devotees as Yoga Narasimha on Thursday.

While Vrishabhas and Gajarajas were walking in front of the celestial carrier,  chekkabhajans and kolatams by artists enhanced the glory of Vahana Seva.

Devotees offered Karpura Neerajanam at every step.

Meanwhile, the lion carrier on the third day symbolizes discipline and virtue.  

Lion is a sign of prowess, courage, brilliance, dominance and majesty.  All these powers become conscious with the darshan of the lord as Narasimha developing the spirit of success.  

Temple Officers and religious staff were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2025 ఫిబ్రవరి 20: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం 8 గంట‌లకు అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సింహ వాహనం – ధైర్య‌సిద్ధి

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపించారు.

కాగా, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు కటాక్షిస్తారు.

వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.