GODDESS BLESSES DEVOTEES ON SIMHA VAHANAM FROM VAHANAM MANDAPAM _ సింహ వాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో శ్రీ పద్మావతి

Tirupati, 30 November 2024: Following incessant rains due to the cyclone effect, TTD has observed Simha Vahana Seva in Vahana Mandapam itself on Saturday evening.

The ongoing Karthika Brahmotsavam witnessed Sri Padmavati donned as Sri Yoga Narasimha Swamy on Simha Vahanam.

Both the Tirumala Pontiffs, EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam and other officials, devotees were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సింహ వాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో శ్రీ పద్మావతి

తిరుపతి, 2024 నవంబరు 30: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజైన శనివారం రాత్రి సింహ వాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

తుఫాన్ నేపథ్యంలో వాహన మండపంలో భక్తులు అమ్మవారిని సేవించుకున్నారు.

సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ శ్యామల రావు, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.