SIMHA VAHANAM OBSERVED_ సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

Tirupati, 09 June 2025: Sri Prasanna Venkateswara Swamy took a celestial ride on Simha Vahanam in Yoga Narasimha Alankaram on Monday.

Unjal Seva will be performed in the evening.

Temple officials and devotees were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

తిరుపతి, 2025, జూన్ 09: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం యోగ నారాయణ స్వామి అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సాయంత్రం 5 గం.లకు ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేస్తారు. అనంతరం సా. 5.30 – 6.30 గం.ల వరకు ఊంజల్ సేవ జరుగనుంది.

రాత్రి 7 గం.లకు ముత్యపు పందిరి వాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.

వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.