SIMHA VAHANAM HELD_ సింహ వాహనంపై శ్రీకోదండరాముడు
TIRUPATI, 29 MARCH 2025: The annual Brahmotsavams on the third morning witnessed Sri Kodandarama Swamy taking a celestial ride on Simha Vahanam to bless His devotees on Saturday.
Both the Pontiffs of Tirumala, DyEO Smt Nagaratna and other temple staff were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సింహ వాహనంపై శ్రీకోదండరాముడు
తిరుపతి, 2024 మార్చి 29: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
సింహ రూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహం సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీకోదండరాముడు విహరించి భక్తులను కనువిందు చేయనున్నారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ మునిశంకరన్ , టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ బాబు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.