SOMASKANDA RIDES SIMHAVAHANAM _ సింహ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి దర్శనం

Tirupati, 16 Feb. 20: Sri Somaskandamurty took out celestial ride on Simha Vahanam on Sunday evening as a part of the ongoing annual brahmotsavams of Sri Kapileswara Swamy Temple at Tirupati.

Simha, the lion is the king of the jungle and holds the pride place with its majestic attitude.  Lord Somaskanda, the universal supreme of all living beings took out a pride ride in Simha Vahanam along the streets surrounding the temple.

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati, other staff, devotees participated. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

సింహ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి దర్శనం
 
ఫిబ్రవరి 16, తిరుపతి, 2020: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. గజాలు, వృషభాలు ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాటాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
 
మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు.  మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్ర  మృగాల భయం ఉండదు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తిరాజు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.