SIMHA VAHANAM HELD _ సింహ వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి
Tirupati, 21 February 2025: The Kapileswara Swamy annual ten day mega religious fete in Tirupati on Friday evening witnessed Simha Vahanam.
Sri Somaskanda flanked by Sri Kamakshi blessed devotees on Simha Vahanam.
DyEO Sri Devendra Babu and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సింహ వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి
తిరుపతి, 2025 ఫిబ్రవరి 21: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామి వారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు. మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్రమృగాల భయం ఉండదు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.