COLOURFUL ARTFORMS IMPRESSES DEVOTEES _ సింహ వాహనసేవలో ఆకట్టుకున్న చండ మేళం
Tirupati, 20 February 2025: As part of the annual Brahmotsavam at Srinivasa Mangapuram, the performance of various dance forms impressed devotees.
The art forms included Chanda Melam and Kolatam that attracted the devotees during the Simha Vahana seva on Thursday.
These dance forms were organized under the auspices of TTD Hindu Dharma Prachara Parishad and Dasa Sahitya Project.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సింహ వాహనసేవలో ఆకట్టుకున్న చండ మేళం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 20: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సింహ వాహనసేవలో చండ మేళం, కోలాటాల కళాప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు ఏర్పాటుచేశారు.
చండమేళం
కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన శ్రీ అనిల్ బృందం చండమేళం(కేరళ డ్రమ్స్) వాయిస్తున్నారు. కేరళ డ్రమ్స్ బృందంలో మొత్తం 9 మంది కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు.
కోలాటాల ప్రదర్శనలు
అదేవిధంగా, నల్గొండకు చెందిన కనక దుర్గ కోలాట భజన బృందంలోని 25 మంది, తిరుపతికి చెందిన శ్రీ వల్లభ కోలాట భజన బృందంలోని 20 మంది చిన్నారులు, పాకాల, నారావారిపల్లి, కాకినాడకు చెందిన కళా బృందాలు కోలాటం నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.