BOOKS RELEASED _ సింహ వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
TIRUMALA, 17 OCTOBER 2023: The Publications wing of TTD has released three more spiritual books on Tuesday as part of the ongoing Navaratri Brahmotsavams in Tirumala.
Sri Venkateswara Sachitra Suprabhatam, depiction of Suprabhatam with images for the benefit of students, Nitya Prarthana Shlokalu and Kodandapani Natakam by Sri Taraka Rama Rao were released in front of Simha Vahanam on Tuesday by TTD Chairman Sri Karunakara Reddy and EO Sri AV Dharma Reddy.
సింహ వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుమల, 2023 అక్టోబర్ 17: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన మంగళవారం ఉదయం సింహ వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు.
శ్రీ వేంకటేశ్వర సచిత్ర సుప్రభాతం
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తెరిచినప్పటి నుండి జరిగే సేవలలో సుప్రభాతసేవ భక్తలోకంలో ఎంతో విశిష్టత సంచరించుకున్నది. సుప్రభాతంలో తొలి శ్లోకం రామాయణంలోనిది, రెండవ శ్లోకం విష్ణు పురాణంలోనిది, పరమాత్మను సుప్రభాతంతో మేల్కొల్పడం ఒక అద్భుత ఫలితాన్నిచ్చే వైదిక కర్మ. తిరుమలలో ధనుర్మాసంలో తప్పించి ప్రతిరోజు పఠింపబడే ఈ సుప్రభాతాన్ని నేటి బాల బాలికలకు, యువకులకు అర్థమయ్యే రీతిలో ఆకర్షణీయమైన తైలవర్ణ చిత్రాలతో తాత్పర్యసహితంగా టీటీడీ అందిస్తున్నది. ఇదివరలో తెలుగు, కన్నడ, భాషలలో అందించిన ఈ శ్రీ వేంకటేశ్వర సచిత్ర సుప్రభాతాన్ని, ప్రస్తుతం తమిళ భాషలో తమిళ భక్తుల సౌకర్యార్థం టీటీడీ అందిస్తున్నది.
నిత్య ప్రార్ధనా శ్లోకాలు – శ్రీ ఎన్. తారక రామారావు
నవవిధ భక్తీ మార్గాలలో స్మరణ, కీర్తనలు, ప్రధానమైనవి. అనగా భగవంతుని గుణగణాలను కీర్తించడం స్తుతించటం. భక్తులు ఉపాసకులు తమ తమ ఇష్టానుసారం ఎందరో దేవి దేవతలను ఆరాధిస్తుంటారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ వినాయకుడు మొదలుకుని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, అన్నపూర్ణాదేవి, భూదేవి, తులసీదేవి, గోమాత, సుబ్రహ్మణ్య స్వామి, వైనతేయుడు, ఆదిశేషుడు, హనుమంతుడు, పరమేశ్వరుడు, మృత్యుంజయస్వామి, శ్రీమహావిష్ణు, ధన్వంతరి, నరసింహ స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలైన దాదాపు 50 మంది దేవి దేవతల ప్రార్ధన శ్లోకాలను మరియు నవగ్రహ శ్లోకాలను బావార్థ సహితంగా అందించారు.
కోదండపాణి నాటకం – శ్రీ ఎన్. తారక రామారావు
లౌకిక సంస్కృత వాంఙ్మయంలో మొట్టమొదటి కావ్యం వాల్మీకి రాసిన శ్రీమద్రామాయణం. దీని ఆధారంగా చేసుకుని భారతీయ భాషల్లో రామాయణాలు అనేకం వచ్చాయి. ముఖ్యంగా మన తెలుగు భాషలో అనేక దృశ్య, శ్రవ్య రామాయణాలు వచ్చాయి. వాటిలో శ్రీ తారక రామారావు రాసిన కోదండపాణి నాటకం ఒకటి.
ఇక్ష్వాకు వంశంలో కోదండాన్ని పూజించిన వారే కాని ధరించిన వారు లేరు. వశిష్ఠుడు ఈ ధనస్సును ధరించడానికి యోగ్యుడవు నీవే అని చెప్పి శ్రీరామునికి ఇస్తాడు. అప్పటి నుండి రాముడు కోదండపాణి అవుతాడు. ఈ కోదండంతోనే రాముడు తాటకిని మొదలుకొని రావణుడి వరకు రాక్షసులందరినీ సంహరించి అజేయుడిగా నిలుస్తాడు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా వ్యవహారిక భాషలో వ్రాయబడింది.
ఈ కార్యక్రమంలో ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విభీషణ శర్మ, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్య పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.