DHARMIC BOOKS RELEASED IN FRONT OF SIMHA VAHANA _ సింహ వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
Tirumala, 29 September 2022: Three Dharmic books published by TTD were released on Thursday in front of Simha vahana by TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Sri AV Dharma Reddy.
They included Sadacharam- Vaigynanika Viluvalu ” penned by Dr Annadanam Chidambara Shastri. Another one, “Sadhivimanula Sandeshalu” written by Dr Surapuraju Vasanta Kumari which is a compilation of 11 women of Puranas written in simple Telugu. And the final one by Dr Gunasekar on “Sri Tayumanavar”-a Tamil literary legend was published under TTD Brahmamokkate series of TTD.
TTD Trust Board members Sri Pokala Ashok Kumar, Sri Ramulu, Delhi Local Advisory Committee President Smt Vemireddy Prashanti Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, publications special officer Sri Ramakrishna Shastri, Sub-editor Dr Narasimhacharya were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సింహ వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుమల, 2022 సెప్టెంబరు 29: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం సింహ వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు.
డా|| అన్నదానం చిదంబర శాస్త్రి రచించిన ”సదాచారము – వైజ్ఞానిక విలువలు ” గ్రంథాన్ని ఆవిష్కరించారు.
డా|| సూరపురాజు వసంతకుమారి రచించిన ”సాధ్వీమణుల సందేశాలు” గ్రంథాన్ని ఆవిష్కరించారు. పురాణాలలోని ప్రసిద్ధ 11 మంది సాధ్వీమణులు నేటి తరానికి అందించిన సందేశాలను విశ్లేషణాత్మకంగా సామాన్య ప్రజానీకానికి సైతం అర్థమయ్యేలా సులభమైన భాషలో ఈ గ్రంథాన్నిరచించారు.
డా|| గాలి గుణశేఖర్ రచించిన ”తాయుమానవర్” గ్రంథం. శ్రీ తాయుమానవర్ తమిళ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవలు అందించారు. టీటీడీ బ్రహ్మమొక్కటే గ్రంథమాల శీర్షిక ద్వారా ఈ శ్రీ తాయుమానవర్ అనే గ్రంధాన్ని ప్రచురించింది.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ రాములు, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రామకృష్ణశాస్త్రి, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్య పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.