TAMILNADU AND KARNATAKA ARTS AMUSES DEVOUT _ సింహ వాహన సేవలో ఆకట్టుకున్న తమిళనాడు కళా బృందాల అద్భుత ప్రదర్శన
Tirumala, 17 October 2023: The artistes from Tamilnadu and Karnataka presented various art from in front of Simha Vahanam on Tuesday that impressed devotees.
Moyilattam, Bharatanatyam, Gopika Nrityam, Meenakshi Tayar Nrityam, Srinivasa Padmavati dance ballet are a few to mention.
From Karnataka, Cahndrachuda Nrityam, Kolatam by Vizag team of AP also enthralled devotees.
సింహ వాహన సేవలో ఆకట్టుకున్న తమిళనాడు కళా బృందాల అద్భుత ప్రదర్శన
– శ్రీవారి అనుగ్రహంతో తిరు మాడ వీధుల్లో ప్రదర్శన
– మీడియా సమావేశంలో టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన కళాకారులు
తిరుమల, 2023 అక్టోబర్ 17: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన మంగళవారం ఉదయం సింహ వాహనసేవలో తమిళనాడు రాష్ట్రం నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలిచ్చారు.
తమిళనాడు రాష్ట్రం శ్రీరంగానికి చెందిన శ్రీమతి రాజీ బృందం మొయిళ్ళాట్టం నృత్యాన్ని ప్రదర్శించారు. చెన్నైకి చెందిన శ్రీమతి పుష్కల బృందం శ్రీనివాస పద్మావతి అమ్మవారి నృత్యంతో కనువిందు చేశారు. ఎరోడ్, చెన్నైకి చెందిన శ్రీమతి చిత్రా శివకుమార్ నేతృత్వంలో భరతనాట్యాన్ని ప్రదర్శించారు. చెన్నైకి చెందిన శ్రీమతి లత బృందం మీనాక్షి అమ్మవారి నృత్యంతో అలరించారు. సేలానికి చెందిన శ్రీ రాజా బృందం గోపికా నృత్యాలతో అలరించారు. పాండిచ్చేరికి చెందిన శ్రీమతి విచిత్ర బృందం భరతనాట్యంతో ఆకట్టుకున్నారు.
అదేవిధంగా, బెంగుళూరుకు చెందిన శ్రీమతి అభిరామి ఆధ్వర్యంలో చంద్రచూడా నృత్యంతో కనువిందు చేశారు. విజయవాడకు చెందిన శ్రీమతి వైజయంతి మాల ఆధ్వర్యంలో కోలాటాలు, విశాఖపట్నంకు చెందిన శ్రీ పరమేశ్వర శర్మ బృందం కోలాటాలతో ఆడిపాడి అభినయించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.
సింహ వాహన సేవలో మొత్తం 11 కళాబృందాలు, 284 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత, నృత్య, కళా ప్రదర్శనలతో భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించారు.
శ్రీవారి అనుగ్రహంతో తిరు మాడ వీధుల్లో ప్రదర్శన : కళాకారులు
వాహనసేవ అనంతరం వివిధ కళాబృందాలకు చెందిన కళాకారులు మీడియా సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రం కల్చరల్ ఇన్‌చార్జ్ శ్రీమతి పూర్ణ పుష్కల మాట్లాడుతూ, శ్రీవారి అనుగ్రహంతో మాడ వీధుల్లో ప్రదర్శనలివ్వడం పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. చెన్నై, సెలం, తిరుచ్చి, శ్రీరంగం, ఎరోడ్ నుండి 6 కళాబృందాలు, 150 మంది కళాకారులు ఈ రోజు ప్రదర్శనలో పాల్లొన్నట్లు చెప్పారు. ఇందులో 10 నుండి 30 సంవత్సరాల మధ్య వమస్సు గల విద్యార్థులు, ఉపాధ్యాములు, ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు ఉన్నట్లు తెలిపారు. టీటీడీ అధికారులు చక్కటి బస, భోజన ఏర్పాట్లు చేశారని, ప్రతి కళా బృందం వద్దకు వచ్చి కళాకారుల వస్త్రాధారణ, నృత్యం, అభినయంను పరిశీలించిట్టు వివరించారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.