“PAY LINK SMS” FOR THE EASE OF DEVOTEES _ సిఆర్ఓలో లక్కీడిప్ లో సేవాటికెట్లు పొందిన భక్తులకు “పే లింక్” ఎస్ఎంఎస్
TTD INTRODUCES THE NEW FACILITY ON TRIAL BASIS
FACILITY TO BE EXTENDED TO VIP BREAK TICKETS SOON
Tirumala, 20 July 2023: TTD has announced a new online system for devotees to procure hard copy of arjita Sevas and break Darshan tickets
Previously the CRO allots tickets to devotees after lucky dip draws who later visits counters to make payment and get tickets.
But as per the new improved system, the CRO sends the ‘Pay link’ SMS to devotees who got the tickets in Lucky Dip. These devotees should click the link and make payment online by UPI, Credit/Debit or Net Banking, get printouts of their ticket without going to CRO.
The new system is experimentally operational at the lucky dip counter in the CRO. Soon the system will be implemented at the MBC-34 counter for the allotment of Arjita Sevas and VIP Break Darshan tickets also after verifying the process for a few days.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సిఆర్ఓలో లక్కీడిప్ లో సేవాటికెట్లు పొందిన భక్తులకు “పే లింక్” ఎస్ఎంఎస్
– కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదు
– ఆన్లైన్లో సొమ్ము చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకోవచ్చు
– త్వరలో బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ సదుపాయం
తిరుమల, 2023, జూలై 20: తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. “పే లింక్” ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు.
సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సిఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుకానుంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.