GUDIKO-GOMATA SCHEME UNVEILED AT KAKINADA _ సిఎం ఆదేశంతో దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం – శ్రీ బాలాత్రిపురసుందరి ఆలయంలో ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
Tirupati, 12 Dec. 20: Under the directives of Honourable CM of AP Sri YS Jaganmohan Reddy’s vision for propagation of Hindu Sanatana Dharma, TTD is contemplating to implement the Gudiko-Gomata program across the country, said TTD Chairman Sri YV Subba Reddy.
Disclosing this at Kakinada while unveiling the unique program at Sri Bala Tripurasundari temple on Sunday the TTD Board Chief said worship of Cow is equivalent to worship of all Gods in Hindu Dharma.
He said the TTD is prepared to present a pair of a Cow and Calf to all temples, Mutts and Veda Pathashalas in the country to facilitate cow worship by all devotes, if the institutions come forward for their protection and caretaking.
He said the TTD will initially launch the program in all southern states and later scale it up nationally.
TTD Chairman said TTD has decided to build 500 temples in the colonies of SC/ ST/BC and fishermen across AP and Telangana states under the aegis of the HDPP. Besides seeking spiritual interference against pandemic COVID-19, TTD has launched several spiritual programs.
He said after consulting 26 pontiffs and Agama experts, TTD has decided to provide Vaikunta Dwara Darshan to devotees for 10 days from December 25 to January 3. But the devotees have to book their tickets online, if not they can get advance tickets at Tirupati.
He said the TTD IT department had resolved technical snags which had occurred due to devotees logging at once for Vaikunta Ekadasi Darshan tickets.
Adding further he said the TTD will reopen the TTD information centres to provide darshan tickets easily to devotees, once the situation turns to normalcy.
AP ministers Sri Kannababu, Sri Viswaroop, Sri Venugopalkrishna, MP Smt Vanga Geeta, Chairman of Sri Bala Tripurasundari temple Sri P Ratnaji and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సిఎం ఆదేశంతో దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం
– శ్రీ బాలాత్రిపురసుందరి ఆలయంలో ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి, 2020 డిసెంబరు 12: ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో హిందూ ధర్మాన్ని విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్వహించబోతున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పవిత్ర కార్తీక మాసంలో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ కార్యక్రమం ప్రారంభించామని, అలాగే తిరుపతి, విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించామని ఆయన చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ బాలాత్రిపురసుందరి ఆలయానికి శనివారం ఆవు, దూడను అందించి గుడికో గోమాత కార్యక్రమాన్నిశ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవును పూజిస్తే తల్లిని, ముక్కోటి దేవతలను పూజించినట్లేనని, అందుకే టిటిడి గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన చెప్పారు. దేశంలో భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేయడానికి టిటిడి సిద్ధంగా ఉందన్నారు. దేశంలోని ఆలయాలు, పీఠాలు, వేద పాఠశాలలు ముందుకొస్తే టిటిడి గోవును అందిస్తుందని, వాటి రక్షణ, పోషణ మాత్రం వారే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో కర్ణాటక, తమిళనాడులో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హిందూ ధర్మప్రచారంలో భాగంగా గిరిజన, దళిత, బలహీన, మత్స్యకారుల కాలనీల్లో హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా 500 ఆలయాలు నిర్మించడానికి టిటిడి నిర్ణయం తీసుకుందని చెప్పారు. టిటిడి సామాన్య ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరోనా నుంచి ప్రపంచ ప్రజలను కాపాడాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత రెండేళ్లుగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి స్వామివారి దర్శనం చేయిస్తున్నామని ఛైర్మన్ వివరించారు. ఈసారి 26 మంది పీఠాధిపతులు, మఠాధిపతులతో చర్చించి డిసెంబరు 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల ఆలయ వైకుంఠ ద్వారం తెరిచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే, భక్తులు ఆన్‌లైన్ ద్వారా ముందుగా టికెట్ బుక్ చేసుకుని తిరుమలకు రావాలని, ఆన్‌లైన్‌లో టికెట్లు లభించని వారు తిరుపతిలో ముందుగా దర్శనం టికెట్లు పొందాలని శ్రీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. టిటిడి వెబ్‌సైట్ ద్వారా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కోసం లక్షలాది మంది ఆన్‌లైన్‌లో ఒకేసారి ప్రయత్నించడంతో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయన్నారు. టిటిడి ఐటి విభాగం ఈ సమస్యను పరిష్కరించిందన్నారు. కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయాక సమాచార కేంద్రాలను తిరిగి భక్తులకు అందుబాటులోకి తెచ్చి దర్శనం టికెట్ల బుకింగ్‌లో ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.
రాష్ట్ర మంత్రులు శ్రీ కన్నబాబు, శ్రీ విశ్వరూప్, శ్రీ వేణుగోపాలకృష్ణ, ఎంపి శ్రీమతి వంగా గీత, శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీ రాపాక వరప్రసాద్, శ్రీ పెండెం దొరబాబు, మాల కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ పెదపాటి అమ్మాజి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ బందన హరి, శ్రీ బాలాత్రిపురసుందరి ఆలయ ఛైర్మన్ పెద్ది రత్నాజి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.