JUBILATION MARKS I DAY FETE IN TTD ADMINISTRATIVE BUILDING _ సివిఎస్వోకు సేవా మెడల్ అందజేత
Tirupati, 15 August 2022: The 76th Independence Day celebrations were grandly observed by TTD in its Administrative Building with patriotic fervour on Monday.
On the auspicious occasion, the TTD CVSO Sri Narasimha Kishore has received the Police Antarik Suraksha Seva medal announced by the Union Government in recognition of his excellent services, over the hands of TTD EO Sri AV Dharma Reddy.
Thereafter the TTD Vigilance and Security staff presented an attractive parade led by Parade commander AVSO Sri Vishwanatham. The TTD EO presented merit certificates and 5 Gms silver Srivari dollars to 62 officers and 207 employees besides cash awards and appreciation certificates to 35 students.
ATTRACTIVE FIRE FIGHTING SQUAD DISPLAY
The Fire Fighting Squad put up a mock display of their skills in fighting forest fires in the Sheshachala forest ranges.
Among others the display of bomb squad along with the dog squads in detecting the explosives, drugs and Red sanders and the pyramid formation by vigilance constables stood as the highlights of I-Day celebrations.
CULTURAL PROGRAMS
The patriotic songs and dances presented by the students of the SV college of Music and Dance students stood as another hallmark of the celebrations.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సివిఎస్వోకు సేవా మెడల్ అందజేత
-అధికారులు, ఉద్యోగులకు వెండి డాలర్, ప్రశంసా పత్రాల బహూకరణ
తిరుపతి, 2022 ఆగస్టు 15: టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తనకు కేంద్ర ప్రభుత్వం అందించిన పోలీస్ ఆంత్రిక్ సురక్ష సేవా మెడల్ ను టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి ద్వారా అందుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా జరిగిన కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా సివి ఎస్వో ను ఈవో అభినందించి మెడల్ అందించారు.
అనంతరం టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ విశ్వనాథం పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టిటిడి విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 61 మంది అధికారులు, 207 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు. 35 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందించారు.
ఆకట్టుకున్నఫైర్ ఫైటింగ్ స్క్వాడ్ విన్యాసాలు :
శేషాచల అడవుల్లో మంటలు వ్యాపించినపుడు వెంటనే అక్కడికి చేరుకుని ఎలా అదుపుచేస్తారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఏం చేస్తారనే అంశాలపై ఫైర్ ఫైటింగ్ స్క్వాడ్
పలు విన్యాసాలు చేశారు.
బాంబ్ స్క్వాడ్ ప్రదర్శనలో శునకాల ద్వారా బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను గుర్తించి నిర్వీర్వ్యం చేయడాన్ని చూపారు. డాగ్ షోలో శునకాలు మాదకద్రవ్యాలు, ఎర్రచందనం తదితర పదార్థాలను గుర్తించడాన్ని ప్రదర్శించారు. భద్రతా సిబ్బంది చేసిన పిరమిడ్ ప్రదర్శన ఆకట్టుకుంది.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు దేశభక్తి గీతానికి చక్కటి నృత్యం ప్రదర్శించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.