SURYA GRAHANAM TO IMPACT DARSHAN IN LOCAL TEMPLES ON JUNE 21 _ సూర్యగ్రహణం సంద‌ర్భంగా జూన్ 21న‌ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు టిటిడి స్థానిక ఆలయాల మూత‌

Tirupati, 17 Jun. 20: In view of Surya Grahanam on June 21, the locals temples in Tirupati including Tiruchanoor, Srinivasa Mangapuram, Appalayagunta will remain closed till afternoon.

After Ekanta Seva on June 20, the temple doors of respective temples will be closed. They will be opened after 2.30pm and cleaning rituals like Suddhi, Punyaha Vachanam etc.will be performed. 

In Sri Padmavathi Ammavari temple as the rituals of Suprabhatam, Sahasra Namarchana, Nityarchana followed by evening bell and Naivedyams lasts till 7.30pm on June 21, TTD has dispensed with Darshan for devotees.

However, in temples like Sri Kodanda Rama Swamy, after Suddhi and other rituals between 4pm and 6pm, the devotees will be allowed for darshan between 6pm and 7pm followed by evening Tomala Seva and Ekanta Sevas.

In Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram, after Suddhi, the devotees will be allowed for darshan between 4.30pm and 6pm.

In Sri Kapileswara Swamy temple at Tirupati, after performing Suddhi, Punyahavachanam, the Kainkaryams to the presiding deity will be performed. However, there will be no Darshan for devotees.

While in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta, after Suddhi and other Kainkaryams, there will be Ekanta Seva between 5.45pm and 6.15pm and Darshan is dispensed with for devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సూర్యగ్రహణం సంద‌ర్భంగా జూన్ 21న‌ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు టిటిడి స్థానిక ఆలయాల మూత‌

తిరుప‌తి, 17 జూన్‌ 2020: సూర్య‌గ్రహణం కారణంగా టిటిడికి అనుబంధంగా ఉన్న‌ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో  జూన్ 21వ తేదీన మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఆల‌య త‌లుపులు మూసి ఉంచుతారు. జూన్ 21న ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా జూన్ 20వ తేదీ రాత్రి ఏకాంత సేవ త‌రువాత ఆల‌య తలుపులు మూసివేస్తారు. తిరిగి జూన్ 21న మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ఆల‌య తలుపులు తెరుస్తారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ 21న మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరుస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు శుద్ధి, పుణ్య‌హ‌వ‌చ‌నం నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వ‌రకు సుప్ర‌భాతం, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, నిత్యార్చ‌న చేప‌డ‌తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌రకు శుద్ధి, మొద‌టి గంట‌, రెండో గంట‌, రాత్రి గంట నైవేద్యాలు స‌మ‌ర్పిస్తారు. రాత్రి 7.30 గంట‌లకు ఏకాంత సేవ నిర్వ‌హిస్తారు. ఈ కార‌ణంగా ఆల‌యంలో ఆ రోజు పూర్తిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దు.

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూన్ 21 మ‌ధ్యాహ్నం 3.45 గంట‌ల‌కు ఆలయం తలుపులు తెరుస్తారు. సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యశుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల‌సేవ, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, మొద‌టి గంట‌, రెండో గంట నైవేద్యాలు స‌మ‌ర్పిస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ఉంటుంది. రాత్రి 7 నుండి 8 గంటల వ‌ర‌కు రాత్రి తోమాల‌సేవ‌, రాత్రి గంట అనంత‌రం ఏకాంత సేవ నిర్వ‌హిస్తారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మ‌ధ్యాహ్నం 2.30  గంటలకు ఆల‌య త‌లుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్య‌హ‌వ‌చ‌నం, ఇత‌ర కైంక‌ర్యాల ఆనంత‌రం మ‌ధ్యాహ్నం 4.30 గంట‌ల నుండి 6 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో

అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మ‌ధ్యాహ్నం 2.30  గంటలకు ఆల‌య త‌లుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్య‌హ‌వ‌చ‌నం, ఇత‌ర కైంక‌ర్యాల ఆనంత‌రం రాత్రి గంట నైవేద్యాలు స‌మ‌ర్పిస్తారు. సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు ఏకాంత సేవ నిర్వ‌హిస్తారు. ఈ కార‌ణంగా ఆల‌యంలో ఆ రోజు పూర్తిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.