SURYA PRABHA VAHANA SEVA HELD _ సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం
TIRUPATI, 24 FEBRUARY 2025: In scorching bright daylight, Sri Kalyana Venkateswara as Srimannarayana glittered on the Suryaprabha vahanam on the seventh day as a part of the ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram on Monday.
Finely decked with orange ixora garlands, the divine charm of the utsava deity enhanced while the dance and bhajan troupes in front of the vahanam glorified the grandeur of Vahana Seva.
Spl.Gr.DyEO Smt Varalakhsmi and other temple staff, devotees were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం
– పరవశించిన భక్త జనం
– ఫిబ్రవరి 25న రథోత్సవం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 24: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీ మన్నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆయురారోగ్యప్రాప్తి :
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 25న రథోత్సవం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 5 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 8.40 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.