GOVARDHANA GIRIDHARAI SHINES ON SURYAPRABHA _ సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారి రూపంలో శ్రీ పద్మావతి

Tirupati, 04 December 2024: On the seventh day of the ongoing  Sri Padmavati Ammavari Kartika Brahmotsavam at Tiruchanoor Wednesday morning the devotees were blessed by in Goddess in Govardhanagiridhari Sri Krishna alankaram on Suryaprabha Vahanam.

The Goddess blessed the devotees in the four Mada streets of the temple amid the chanting of mangal  Vadhyams and the chanting of devotees ran from 8 am to 10 am. 

Lord Surya is the manifest of Narayana. The Upanishads state that Srimannarayana, who is with Lakshmi, emerges from under the sun mandala.The darshan of Amma in Surya Prabha Vahana bestows the fruits of health, wealth, prosperity, wisdom etc.

Tonight Goddess Sri Padmavati will grace devotees on Chandraprabha Vahanam.

RATHOTSAVAM ON  DECEMBER 5

On the eighth day of S  Brahmotsavam, Ammavari Rathotsavam will be held in splendour on Thursday at 8 am. All the devotees who have worshipped the mother prepare their chariots as she will gloriously with the retinue of Alamelu Manga Sakaldevata adorned with all the ornaments. Also, Amma will ride on  Aswa Vahana at night.

Tirumala  pontiffs Sri Sri Sri Pedda Jeeyangar,  and Sri Sri  Sri Chinna Jeeyangar, EO  Sri J. Shyamala Rao, JEO Sri Veerabraham, Deputy EO Sri Govindarajan, temple priests Sri Babu Swamy, other dignitaries and a large number of devotee were present 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారి రూపంలో శ్రీ పద్మావతి
 
తిరుపతి, 2024 డిసెంబరు 04: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం ఉదయం అమ్మవారు శ్రీ గోవర్ధనగిరిధారియైన శ్రీ కృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
 
మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. భక్తులు అడుగడుగునా  నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. 
 
సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది.
 
 రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
 
డిసెంబరు 5న రథోత్సవం
 
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు  అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. సర్వాలంకార సంశోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు విహరించనున్నారు.
 
వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, ఈవో శ్రీ జె. శ్యామలరావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.