GODDESS BLESSES DEVOTEES AS DHANWANTARI _ సూర్యప్రభ వాహనంపై ధన్వంతరి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు

TIRUPATI, 23 FEBRUARY 2025: As a part of the ongoing annual brahmotsavams in Sri Padmavati Ammavari temple at Chennai, the utsava deity blessed Her devotees as Dhanwantari-the God of Medicine on the Surya Prabha Vahanam on the bright Sunday.

There is the belief among the devotees that the darshan of Ammavaru in Surya Prabha Vahana bestows the fruits of health, wealth, prosperity, wisdom that are important to lead a peaceful life.

AEO Sri Parthasaradhi, other temple staff were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై ధన్వంతరి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు

చెన్నై / తిరుపతి, 2025 ఫిబ్రవరి 23: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉద‌యం 9 గంట‌లకు అమ్మ‌వారు ధన్వంతరి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు.

సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 24న ఉద‌యం 9.30 గంట‌ల‌కు ర‌థోత్స‌వం, రాత్రి 7 గంట‌ల‌కు అశ్వ‌వానంపై అమ్మ‌వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులు పాల్గొన్నారు. 

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.