SURYA PRABHA VAHANAM AT KT _ సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి కటాక్షం
Tirupati, 5 Mar. 21: Sri Somaskandamurthi with Kamakshidevi seated majestically on Suryaprabha Vahanam on Friday.
As part of ongoing annual brahmotsavams in Kapileswara Swamy temple, Suryaprabha vahanam took place in Ekantam.
DyEO Sri Subramanyam and others participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి కటాక్షం
తిరుపతి, 2021 మార్చి 05: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో వాహనసేవ ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా జరిగింది.
చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటిసూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మయామోహాందకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి, భక్తులకు సంసారతాపాన్ని తొలగిస్తున్నాడు.
కాగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస్‌నాయక్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.