SURY PRABHA VAHANA SEVA HELD _ సూర్యప్రభ వాహనంపై శ్రీ మహావిష్ణువు అలంకారంలో శ్రీవేంకటేశ్వరుడు
TIRUPATI, 04 MARCH 2025: The ongoing annual Brahmotsavam in Sri Venkateswara Swamy temple in Jubilee Hills witnessed the utsava deity taking a majestic ride on Suryaprabha Vahana.
On the bright sunny Tuesday, the devotees were thrilled to witness the procession of the deity on the Sun carrier.
AEO Sri Ramesh and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సూర్యప్రభ వాహనంపై శ్రీ మహావిష్ణువు అలంకారంలో శ్రీవేంకటేశ్వరుడు
హైదరాబాద్ / తిరుపతి, 2025 మార్చి 04: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారు శ్రీమహా విష్ణువు అలంకారంలో సూర్య ప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.