ARTFORMS CASTS MAGICAL SPELL _ సూర్యప్రభ వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా బింస‌, పేరిణి, డోలు-పునిత ‌నాట్యం

TIRUPATI, 23 NOVEMBER 2025: The various artistes impressed the devotees with their artforms in front of the Suryaprabha Vahanam on Sunday at Tiruchanoor.

Dolukunita, Bhimsa, Punita Natyam, Peacock dance, Kerala folk dance, Dappu were a few that allured the devotees.

Besides the different mythological characters portrayed by the artistes also attracted the devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సూర్యప్రభ వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా బింస‌, పేరిణి, డోలుపునిత‌ నాట్యం

తిరుపతి, 2025 న‌వంబ‌రు 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 15 కళాబృందాలు 250 మంది కళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.

పాండిచ్చేరి కరైకల్ కు చెందిన 20 మంది కళాకారులు నెమలి డాన్స్, చెన్నై కళా నాట్యాలయానికి చెందిన 28 మంది కళాకారుల కేరళ ఫోక్ డాన్స్, విశాఖపట్నంకు చెందిన  

 నారాయణమూర్తి బృందంలోని 24 మంది కళాకారుల  అరకు బింస సాంప్రదాయ గిరిజన నృత్యం, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ కు చెందిన సతీష్ బృందం 22 మంది కళాకారుల పేరుని నాట్యం భక్తులను ఆకట్టుకుంది.

తిరుపతికి చెందిన సాయినాథ్ బృందంలోని 24 మంది కళాకారుల డప్పు డాన్స్, రమ్య బృందం మోహిని అట్టం, సత్యనారాయణమూర్తి బృందం సమల్పూరి ఫోక్ డాన్స్, కేరళకు చెందిన సిద్దు పృధ్విరాజ్ బృందం మహిషాసుర మర్దిని, తమిళనాడుకు చెందిన వనజ ఉదయ్ బృందం దినకరా పరివారం భక్తులలో మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంపొందించింది.

ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ మూర్తుల వేషధారణలు, భరతనాట్యం, కూచిపూడి, కోలాటాలు ప్రదర్శించి భక్తులను ఆహ్లాదపరిచారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది