SUN CARRIER SHINES _ సూర్య ప్రభ వాహనంపై బద్రినారాయణ అలంకరణలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
TIRUPATI, 13 JUNE 2025: The Utsava Murty of Abhaya Hasta Sri Prasanna Venkateswara Swamy took out a celestial ride on the bright Suryapraha vahanam, the Sun carrier on Friday morning.
The ongoing annual festival in Appalayagunta entered the seventh day.
Temple officials, archakas, sevaks and devotees were present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సూర్య ప్రభ వాహనంపై బద్రినారాయణ అలంకరణలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
తిరుపతి/ అప్పలాయగుంట, 2025, జూన్ 13: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 08.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు సూర్య ప్రభ వాహనంపై బద్రినారాయణ అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.
ఉదయం 05.00 గంటలకు శ్రీవారికి, అమ్మవార్లకు అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం 7.30 – 8.00 గం.ల మధ్య శ్రీవారిని వాహన మండపంలోకి వేంచేపు చేశారు. తదుపరి ఉ. 8.00 – 9.00 గం.ల మధ్య సూర్య ప్రభ వాహనంపై స్వామి వారు వివరించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ జరుగనుంది.
శుక్రవారం రాత్రి 07.00 గం.లకు చంద్రప్రభ ప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు.
జూన్ 14న రథోత్సవం
జూన్ 14న శనివారం ఉదయం 09.00 గం.లకు రథోత్సవం జరుగుతుంది.
వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.