SEPTEMBER MONTH EVENTS IN KRT _ సెప్టెంబరులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
TIRUPATI, 31 AUGUST 2024: The following are the events lined up in the month of September in Sri Kodandarama Swamy temple in Tirupati.
September 3: Sahasra Kalashabisekam and Hanumanta Vahanam
September 7,14,21,28: Abhishekam to Mulavarulu
September 18: Sata Kalashabisekam
September 26: Sri Sita Rama Kalyanam
సెప్టెంబరులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2024 ఆగష్టు 31: తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– సెప్టెంబరు 3న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
– సెప్టెంబరు 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
– సెప్టెంబరు 18న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.
– సెప్టెంబరు 26న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.