CHATURVEDA HAVANAM AT MYSORE DATTA PEETHAM FROM SEPTMEBER 1-5 _ సెప్టెంబరు 1 నుంచి 5 వ తేదీ దాకా మైసూరు దత్త పీఠంలో చతుర్వేద హవనం

Tirupati, 31 Aug. 21:TTD is organizing Sri Srinivasa Panchahnika Chaturveda Havanam at Sri Datta Peetham, Mysore from September 1-5.

The event will be conducted under auspices of the TTD’s SV Higher Vedic Studies Institute on appeal by Pontiff of the Datta Peetham, Sri Sri Sri Ganapati Sachidananda Swami, seeking health, prosperity for humanity against all natural calamities.

The five-day event will be held from Bahula Dashami in auspicious Sravana month. As part of the celebrations, Homa kundas are being set up for invocation of Yajneswara with chanting of all four Vedas.

TTD is organizing daily pravachanams by Vedic pundits in the evening followed by bhajans and dance ballads, devotional sangeet concerts etc.

Following are the other programs.

September 1, Brahmarshi V Lakshmi Narayana Ganapati of Vijayawada will present a lecture on the Benefits of Vedokta Yajnas.

September 2: Talk on Significance of Chaturveda Havanam by Acharya Muralidhara Sharma, Vice-Chancellor of National Sanskrit University.

September 3: Acharya KE Devanathan, Vice-Chancellor of Karnataka State Sanskrit University will speak on Veda Bharati and Yajna Devatalu.

September 4: TTD SV Vedic Higher Studies Institute, OSD Dr A Vibhishana Sharma will speak on Veda Havanam and its need in present days.

On September 5: TTD Chairman Sri YV Subba Reddy will participate in the Purnahuti program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 1 నుంచి 5 వ తేదీ దాకా మైసూరు దత్త పీఠంలో చతుర్వేద హవనం

తిరుపతి 31 ఆగస్టు 2021: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అభ్యర్థన మేరకు మైసూరు దత్త పీఠం లో సెప్టెంబరు 1 నుంచి 5 వ తేదీ వరకు ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస పంచాహ్నిక చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహించనున్నారు.

లోకక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్య వృద్ధి, అతివృష్టి, అనావృష్టి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అవతరించిన శ్రావణ మాసంలో బహుళ దశమి నుంచి ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. హోమ గుండాలు ఏర్పాటు చేసి నాలుగు వేదాల్లోని అన్ని మంత్రాలను పఠించి యజ్ఞేశ్వరునికి సమర్పణ చేస్తారు.

ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు వేద విద్వాంసుల ప్రసంగాలు, రాత్రి 7 నుంచి 8 గంటల దాకా భజనలు, నృత్య రూపకం, సంగీత కచేరీలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

1వ తేదీ వేదోక్త యజ్ఞం – ప్రయోజనాలు అనే అంశంపై విజయవాడకు చెందిన బ్రహ్మశ్రీ వి. లక్ష్మీనారాయణ ఘనాపాటి ఉపన్యసిస్తారు. 2వ తేదీ చతుర్వేద హవనం – ప్రాశస్త్యం అనే అంశం మీద జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధరశర్మ ఉపన్యాసం ఉంటుంది.

3వ తేదీ వేద భారతి – యజ్ఞ దేవతలు అనే అంశం మీద కర్నాటక రాష్ట్ర సంస్కృత విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య కె ఈ దేవనాథన్ ఉపన్యసిస్తారు. 4వ తేదీ ప్రస్తుత కాలంలో వేద హవనాలు – వాటి ఆవశ్యకత అనే అంశం మీద టీటీడీ ఎస్వీ వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ ప్రసంగిస్తారు. 5వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది