MEMORIAL MEETINGS ON SEPTEMBER 10 _ సెప్టెంబరు 10న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 43వ వర్ధంతి
Tirupati,09 September 2024: Under the auspices of HDPP and the Annamacharya project, TTD is organising the 43th death anniversary of Sri Sadhu Subramanya Shastry and also the 102th Jayanti utsava of Sri Gouripeddi Ramasubba Sharma at the Annamacharya Kala Mandiram on September 10.
Earlier the life-size statue of Sri Sadhu Subramanya Shastry at SVETA Bhavan will be garlanded followed by floral tributes to the statue of Sri Gouripeddi Ramasubba Sharma at SV Oriental College.
Thereafter in the morning at the Annamacharya Kala Mandiram, the memorial meeting of Sri Sadhu Subramanya Shastry will be held and later in the evening Sri G Ramasubba Sharma ceremony will be observed.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సెప్టెంబరు 10న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 43వ వర్ధంతి
– శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారి 102వ జయంతి ఉత్సవాలు
తిరుపతి, 2024 సెప్టెంబరు 09: టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టులు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సెప్టెంబరు 10వ తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 43వ వర్ధంతి, శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ 102వ జయంతి కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా ముందుగా ఉదయం 9.15 గంటలకు శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి, ఉదయం 9.45 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది.
అనంతరం ఉదయం 10.30 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి వర్ధంతి సందర్భంగా సభా కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 గంటలకు శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ 102వ జయంతి సందర్భంగా సభా కార్యక్రమం ఉంటుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.