సెప్టెంబరు 18వ తేదీన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ‘కల్యాణవెంకన్న ఆలయంలో మేల్‌చాట్ వస్త్రాలు మాయం!’ అనే వార్తకు వివరణ
సెప్టెంబరు 18వ తేదీన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ‘కల్యాణవెంకన్న ఆలయంలో మేల్‌చాట్ వస్త్రాలు మాయం!’ అనే వార్తకు వివరణ
తిరుపతి, 2012 సెప్టెంబరు 20: సెప్టెంబరు 18వ తేదీన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ‘కల్యాణవెంకన్న ఆలయంలో మేల్‌చాట్ వస్త్రాలు మాయం!’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం.
ఈ సందర్భంగా తితిదే కార్యనిర్వహణాధికారి ఆదేశాలుబేఖాతర్ అని చర్యలు తీసుకోని అధికారులు అని ప్రచురించటం వాస్తవం కాదు. వాస్తవానికి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుచున్న నేపధ్యంలో అధికారులందరూ బ్రహ్మోత్సవాల పనులలో నిమగ్నమై యున్నందున బదిలీ ప్రక్రియ నిర్వహించలేదని, బ్రహ్మోత్సవాల తదనంతరము సదరు టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ని బదిలీ చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నాము.
కనుక పైతెల్పిన వాస్తవాల్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సినదిగా కోరడమైనది.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి