సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
తిరుపతి / కడప,2025, సెప్టెంబర్ 18: దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సదరు రోజులలో ప్రతిరోజూ ఉదయం 11 గం.ల నుండి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 07 గం.లకు వాహన సేవలు ప్రారంభం కాగా,28వ తేదీ గరుడ వాహనంపై 05.00 గం.లకు స్వామి, అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
ఈ సందర్భంగా సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, 23వ తేదీ శేష వాహనం, 24వ తేదీ చిన్న ప్రభ వాహనం, 25వ తేదీ హనుమంత వాహనం, 26వ తేదీ గరుడ వాహనం, 27వ తేదీ ముత్యపు పందిరి వాహనం, 28వ తేదీ గరుడ వాహనం, 29వ తేదీ తిరుచ్చి వాహనం, 30వ తేదీ సర్వభూపాల వాహనం, అక్టోబర్ 01వ తేదీ చిన్న శేష వాహనం, అక్టోబర్ 02వ తేదీ అశ్వవాహనంపై స్వామి, అమ్మవారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
