TIRUCHANOOR PAVITROTSAVAMS _ సెప్టెంబరు 27 నుండి 29వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
Tirupati, 24 September 2023: The annual three-day Pavitrotsvams will be observed in Tiruchanoor between September 27-29 with Ankurarpanam on September 26.
The Grihastha devotees shall participate on payment of Rs. 750 per ticket on which two persons will be allowed.
On first day TTD has cancelled Kalyanotsavam, Vedasirvachanam, Unjal Seva, second day -Tiruppavada, VIP Break, Kalyanotsavam, Vedasirvachanam, Kumkumarchana, Unjal seva and on final day Abhisheka Anantara Darshan, CIP break, Lakshmi Puja, Kalyanotsavam, Vedasirvachanam, Kumkumarchana, Unjal Sevas.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సెప్టెంబరు 27 నుండి 29వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2023 సెప్టెంబరు 24: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 26వ తేదీ సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది.
ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సెప్టెంబరు 27వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 28న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 29న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి ఒకరు ఒక రోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.
పవిత్రోత్సవాల్లో సెప్టెంబరు 26న అంకురార్పణ రోజున కల్యాణోత్సవం, వేదాశీర్వచనం, ఊంజల్‌సేవ, మొదటిరోజు సెప్టెంబరు 27న కల్యాణోత్సవం, వేదాశీర్వచనం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 28న రెండో రోజు తిరుప్పావడ సేవ, బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, వేదాశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 29న పవిత్రోత్సవాల్లో చివరిరోజు అభిషేకానంతర దర్శనం, బ్రేక్ దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, వేదాశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.