సెప్టెంబ‌రు 28 నుండి 30వ తేదీ వ‌రకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి పవిత్రోత్సవాలు

Tirupati, 21 September 2024: TTD invites sealed tenders for empty tins used for packing ghee, oil and cashew nuts in Tirumala Srivari Temple and other affiliated temples under rate contract. Used empty tins by TTD can be collected till March 2025.

The sealed tenders should be submitted at the Marketing (Auction) Office, Harekrishna Road, Tirupati by 3 PM on October 3.

For other details, Contact Marketing (Auction) Office on 0877-2264429.    

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబ‌రు 28 నుండి 30వ తేదీ వ‌రకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి, 2024 సెప్టెంబ‌రు 21: కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 28 నుండి 30వ తేదీ వ‌రకు పవిత్రోత్సవాలు నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబ‌రు 27న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.

సెప్టెంబ‌రు 28వ తేదీ రక్షబంధనం, పవిత్రప్రతిష్ఠ, శేయాధివాసం, సెప్టెంబ‌రు 29న ఉదయం స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబ‌రు 30న ఉద‌యం హోమాలు, సాయంత్రం మహాపూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగుస్తాయి.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆల‌య ప్రాశ‌స్త్యం –

చిత్తూరు జిల్లా గంగ‌వ‌రం మండ‌లం, కీల‌ప‌ట్ల గ్రామంలో వెల‌సిన శ్రీ కోనేటిరాయస్వామివారి ఆల‌యం అతి పురాత‌నమైన, చారిత్ర‌క ప్ర‌సిద్ధి క‌లిగిన దేవాల‌యం. భృగుమ‌హ‌ర్షి స్వామివారిని ప్ర‌తిష్ఠించి ఆరాధించ‌గా, ఆర్జునుని మునిమ‌న‌మ‌డు జ‌న‌మేజ‌య మ‌హారాజు గుడి క‌ట్టించారు. చోళ‌, ప‌ల్ల‌వ‌, విజ‌య‌న‌గ‌ర రాజుల ఏలుబ‌డిలో విశేష పూజ‌లు అందుకున్నారు.

అనంత‌రం మ‌హ‌మ్మ‌ధీయుల దండ‌యాత్ర‌ల‌కు భ‌య‌ప‌డి గ్రామ‌స్థులు స్వామివారిని కోనేటిలో దాచి ఉంచినారు. ఆ త‌రువాత కాలంలో చంద్ర‌గిరి సంస్థానాధీసులకు స్వామివారు క‌ల‌లో సాక్షాత్క‌రించ‌గా, కోనేటిలోనున్న స్వామివారిని తిరిగి ప్ర‌తిష్ఠించారు. ఈ విధంగా కోనేటి నుండి ప్ర‌తిష్ఠ చేయ‌బ‌డింది కావున కోనేటి రాయ‌స్వామిగా ప్ర‌సిద్ధి చెందినారు. అన్న‌మ‌య్య కీర్త‌న‌ల‌లోని కోనేటిరాయ‌స్వామి ఆల‌యం ఈ గ్రామంలో మాత్ర‌మే ఉన్న‌ది. త‌రువాత కాలంలో పుంగ‌నూరు జ‌మీందార్లు నిత్య కైంక‌ర్యాల‌కు మాన్య‌ముల‌ను స‌మ‌కూర్చినారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.