GT PAVITROTSAVAMS _ సెప్టెంబరు 3 నుండి 5వ తేదీ వరకు తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
Tirupati, August 22, 2025: The annual Pavitrotsavams in Sri Govindaraja Swamy temple is scheduled from September 3-5 with Ankurarpanam on September 2.
On these three days, Snapana Tirumanjanam will be performed to the Utsava deities.
On the first day, Pavitra Pratista, second day, Pavitra Samarpana and on the last day Purnahuti will be observed.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 3 నుండి 5వ తేదీ వరకు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, 2025 ఆగస్టు 22: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 3 నుండి 5వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం ఆచార్య రుత్విక్‌వరణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్రసమర్పణ చేస్తారు. సాయంత్రం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వహించి, ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 3న ఉదయం పవిత్రప్రతిష్ట, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 4న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 5న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
