సెప్టెంబర్ 11 నుండి 19వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవములు

సెప్టెంబర్ 11 నుండి 19వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవములు

అక్టోబర్‌ 8వ తేది నుండి 16వ తేది వరకు శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవములు

తిరుమ‌ల‌, 2010 సెప్టంబర్‌ 09: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవములు సెప్టెంబర్‌ 11వ తేది నుండి 19వ తేది వరకు మరియు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవములు అక్టోబర్‌ 8వ తేది నుండి 16వ తేది వరకు వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా చంటి పిల్ల తల్లిదండ్రులకు సుపథం నుండి మరియు వికలాంగులుక, వృద్ధులకు శ్రీవారి మహాద్వారము నునిడి కల్పించే ప్రత్యేక దర్శనము రద్దుచేయబడినది. బ్రహ్మోత్సవముల తరువాత ప్రత్యేకదర్శనము యథావిధిగా కొనసాగును.

కావున భక్తులు పై మార్పును గమనించి సహకరించ ప్రార్థన.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.