సెప్టెంబర్‌ 25,26,27వ తేదిలలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, సెప్టంబర్‌ -06: తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 25,26,27వ తేదిలలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుమల ఆస్థానమండపం నందు ఘనంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 5.30 నుండి 7.30 వరకు మాడ వీధులలో సంకీర్తన పరిక్రమణము, సామూహిక భజనలు, ఉదయం 8.30 నుండి 12.30 వరకు కోలాటములు, సంకీర్తనలు, మద్యాహ్నం, 2.30 నుండి 6.30 వరకు భజనలు, కోలాటములు, సాయంత్రం 7 గంటల నుండి సంగీత విభావరి నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 25వ తేదిన తిరుమల ఆస్థానమండపం నందు ప్రారంబ సమావేశం నిర్వహిస్తారు. అదేవిధంగా సెప్టెంబర్‌ 27వ తేది ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద నునిడి వేల సంఖ్యలో వచ్చిన భజనమండలుల సభ్యులచే సంప్రదాయ భజనలతో మెట్లపూజ చేస్తూ తిరుమలకు చేరుకుంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.