BALALAYAM AT SRI GT FROM SEPTEMBER 9 TO 13 _ సెప్టెంబరు 9 నుండి 13వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయం
Tirupati, 1 Sep. 21: TTD is organising a traditional Balalayam program at Sri Govindarajaswamy temple from September 9 to 13.
This ritual is observed ahead of the gold lacing of copper plates of the temple Gopuram.
As part of the festivities, on September 8 morning the rituals of Acharya Ritwik Varanam, Senadhipati utsavam, Vastu Homam and Ankurarpanam will be conducted.
The Balalaika is performed in the Kalyana Mandapam where daily rituals for Swamy and Ammavaru are conducted for facilitating the completion of gold lacing works from September 14 onwards till May 2022.
FOLLOWING ARE THE FESTIVITIES OF BALALAYAM
September 9: Akalmasha Homas, Raksha Bhandanam in the morning, Kumbha sthapana and vaidika programs at yagashala after brining kumbhas of Sri Govindarajaswamy, his vahana, Vishwaksena, Jaya, Vijaya, Garuda, Dwaja Sthambham, Bali peetham etc.
September 10: Netra Unmilanam, Pancha gavyadivssan, in the morning, and other vaidika programs in the evening.
September 11: Ksheeradivasam and others
September 12: Jaladhivasam, Sri Govindarajaswamy Bala bimbosthapana, Bimba Vastu, Maha Shanti Abhishekam. Later in the evening Sayanadhivasam and Vishesha Homam.
September 13: Purnahuti, Divya Prabandam, Shattumora after Balalaya samprokshana in Tula lagnam.
Later in the afternoon Nityakatla Kainkaryams, and Vaidika programs at yagashala in the evening.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 9 నుండి 13వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయం
తిరుపతి, 2021 సెప్టెంబరు 01: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 9 నుండి 13వ తేదీ వరకు ”బాలాలయం” కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఆలయ విమాన గోపురానికి రాగి రేకులపై బంగారు తాపడం పనులు చేపట్టేందుకు ముందు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం సెప్టెంబరు 8న ఉదయం 10.30 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం 6.30 గంటల నుండి మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, వాస్తు హోమం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ పనుల కోసం ఆలయంలోని కల్యాణమండపంలో బాలాలయం ఏర్పాటుచేస్తారు. స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు సెప్టెంబరు 14 నుండి 2022 మే నెల వరకు జరుగుతాయి. అప్పటి వరకు భక్తులకు యధావిధిగా మూలమూర్తి దర్శనం ఉంటుంది.
సెప్టెంబరు 9న ఉదయం అకల్మష హోమం, రక్షాబంధనం, సాయంత్రం కుంభస్థాపన చేసి సన్నిధి నుంచి శ్రీ గోవిందరాజస్వామి, స్వామి వారి విమానం, విష్వక్సేనులు, జయ, విజయ, గరుడ, ధ్వజస్తంభం, బలిపీఠం కుంబాలను యాగశాలకు తీసుకొచ్చి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సెప్టెంబరు 10న ఉదయం నేత్ర ఊన్మీలనం, పంచగవ్యాధివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.
సెప్టెంబరు 11న ఉదయం క్షీరాధివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సెప్టెంబరు 12న ఉదయం జలాధివాసం, శ్రీ గోవిందరాజస్వామివారి బాలబింబ స్థాపన, మధ్యాహ్నం బింబవాస్తు, మహాశాంతి అభిషేకం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, శయనాధివాసం, హోత్రం, విశేష హోమం చేపడతారు.
సెప్టెంబరు 13న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, దివ్యప్రబంధ శాత్తుమొర నిర్వహిస్తారు. ఉదయం 9.40 నుండి 10 గంటల మధ్య తులా లగ్నంలో బాలాలయ సంప్రోక్షణం చేపడతారు. మధ్యాహ్నం నిత్యకట్ల కైంకర్యం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.