DO NOT BELIEVE THE FALSE INFO ON TIRUMALA HOTEL MENU PRICES ON SOCIAL MEDIA – TTD _ సోషల్మీడియాలో హోటళ్ల ధరల పై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు
Tirumala, 02 July 2025: In a statement released on Wednesday TTD stated that a message titled “Tirumala Hotel Prices Details” is being widely shared on some social media platforms in recent times and the information is completely fabricated.
Legal action will be taken against those who confuse devotees with such false information.
Devotees are requested to get any information only through the official TTD website (www.tirumala.org) and TTD Call Center (18004254141).
TTD appeals to devotees to get information from official platforms instead of sharing any suspicious information on social media.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సోషల్ మీడియాలో హోటళ్ల ధరలపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు
తిరుమల, 2025 జూలై 02: ఇటీవలి కాలంలో “తిరుమలలో హోటళ్ల ధరల వివరాలు” పేరుతో కొన్ని సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక మెసేజ్ టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ సమాచారం పూర్తిగా వాస్తవ దూరం.
ఈ మెసేజ్‌లో పేర్కొన్న భోజన ధరలు, ఇతర వివరాలు పూర్తిగా కల్పితం.
ఈ విధమైన తప్పుడు ప్రచారాలతో భక్తులను గందరగోళానికి గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా టీటీడీ వెబ్‌సైట్ (www.tirumala.org), టీటీడీ కాల్ సెంటర్ (18004254141) ద్వారా మాత్రమే తెలుసుకోవాలని కోరడమైనది.
ఎలాంటి అనుమానాస్పద సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా అధికారిక వేదికల నుంచే తెలుసుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.