సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ
సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ
తిరుపతి, 2026 ఆగస్టు 01: శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల హాస్టల్ లో శాంభవి బ్లాక్ మరియు ప్రణతి బ్లాక్ లలో మరుగుదొడ్లు, స్నానపు గదులు వినియోగించలేనిస్థితిలో ఉన్నాయని సోషియల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ అసత్య ప్రచారాన్ని టీటీడీ పూర్తిగా ఖండిస్తోంది.
వాస్తవానికి శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో అభివృద్ధి పనుల్లో భాగంగా స్నానపు గదులను, మరుగుదొడ్లను నిర్మించడం జరుగుతోంది. కొందరు వ్యక్తులు దురుద్దేశపూర్వకంగా నిర్మాణంలో ఉన్న స్నానపు గదులు, మరుగుదొడ్లను ఫోటోలు తీసి అసత్య ప్రచారం చేయడం శోచనీయం.
విద్యార్థుల కోసం టీటీడీ విద్యాసంస్థల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తోంది.
ఇలా దుష్ప్రచారానికి ఒడిగట్టిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మకూడదని ఈ సందర్భంగా టీటీడీ తెలియజేస్తోంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
