TTD BOARD CHIEF CLARIFIES _ సోషియల్ మీడియాలో ప్రతిఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరంలేదనే ఉద్దేశంతోనే ఈ విధమైన వ్యాఖ్య – చైర్మన్ క్లారిటీ
TIRUMALA, 10 JANUARY 2025: TTD Trust Board Chief Sri B R Naidu, reacting to social media clips making his statement viral has clarified that his remarks were made with an intention that there is no need to respond to everyone’s comments.
TTD Chairman said that it is not appropriate to attribute my comments to Deputy Chief Minister Sri Pawan Kalyan.
”My comments were not directed at Sri Pawan Kalyan. Immediately after the stampede incident, I apologized to the families of the deceased devotees via media even before the Chief Minister, Deputy Chief Minister and the Ministers, he reminded.
He said that this sort of false propaganda about apologies should be avoided.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సోషియల్ మీడియాలో ప్రతిఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరంలేదనే ఉద్దేశంతోనే ఈ విధమైన వ్యాఖ్య – చైర్మన్ క్లారిటీ
తిరుమల, 2025 జనవరి 10: ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కు నా యొక్క వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు అన్నారు.
నా యొక్క వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కాదు.
మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా
క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలి ఆయన అన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడింది