TTD TEMPLES OBSERVE PAVITROTSAVAMS _ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఘనంగా పవిత్ర సమర్పణ

Tirupati, 03 September 2025: Various temples under the umbrella of TTD observed annual Pavitrotsavams in a ceremonious manner.

When Pavitra Pratista was held in Sri Govindaraja Swamy temple at Tirupati and at the Kosuvaripalle temple,  Pavitra Samarpana was observed in Sri Narapura Venkateswara Swamy temple in Jammalamadugu of Kadapa district and Sri Sowmyanatha Swamy temple at Annamaiah district on Wednesday.

The temple officials, priests and devotees of the respective temples participated in these religious events.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో  శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2025, సెప్టెంబర్ 03: అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి  వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ  జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, యాగ‌శాల‌లో పుణ్యాహవచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు జ‌రిగాయి.

అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూల‌వ‌ర్త‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్‌, బలిపీఠం ధ్వజస్తంభం, ప్రధాన కుంభానికి, ప‌రివార దేవ‌త‌ల‌కు పవిత్రాలు సమర్పించారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు శ్రీ దిలీప్ ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య‌ ప్రజా సంబందాల అధికారిచే విడుదల చేయబడినది.