STEPS TO FILL JOBS IN SPORTS QUOTA – TTD CHAIRMAN SRI BR NAIDU _ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు – టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు

 • ANNUAL SPORTS COMPETITIONS OF EMPLOYEES COMMENCES

Tirupati, 28 February 2025: The Chairman of TTD, Sri BR Naidu said that by filling up jobs in sports quota in TTD, opportunities will be provided to the youth.

He inaugurated the Annual Games and Sports Competition for TTD employees as Chief Guest in TTD Parade Grounds in Tirupati on Friday.

In his speech on the occasion, he wished the employees to showcase their skills so that they prepare themselves to become winners in national and international games and sports in future.   

He said that the employees are physically fit by organizing sports competitions every year.  Actions will be taken to build a sports complex for TTD employees. He said that since 1977, these competitions are being conducted for the employees to develop them physically and mentally.

On this occasion, TTD EO Sri J. Syamala Rao administered the sports pledge with the employees. Later the Chairman along with EO and other officials unveiled the sports flag.  

Balloons and peace flags were flown high in the sky.  On this occasion, the employees conducted a March.

Speaking on the occasion, TTD EO said that the employees are providing special services to the lakhs of devotees who come for the darshan in Tirumala. He appreciated the success of Srivari Brahmotsavam, Sri Padmavati Brahmotsavam, Vaikuntha Ekadashi and Rathasaptami with their collective efforts.  He said that sports are very useful for sports spirit, friendly atmosphere, team work and boosting morale among TTD employees.  He advised that everyone should participate in sports which helps to increases their discipline, mental cheerfulness and physical fitness. 

In these competitions, the first prize winners will be awarded Rs.2 thousand, the second prize winners will be awarded Rs.1800/- and the third prize winners will be awarded bank gift cards worth Rs.1600/-.

Speaking on the occasion, Additional EO Sri Ch Venkaiah Chowdary asked TTD employees to maintain their health and provide better and productive services in their profession.  Sports have been important since the time of the Greeks, he said.  

He suggested that health problems can be controlled through sports and that the physical endurance and rejuvenation comes with sports.  Everyone in TTD is advised to control the pressure and provide better services to the devotees with sporting spirit without getting emotional.

In the inaugural program, the names of the employees registered to participate in the sports, the teams, the competition schedule and other details were informed.  

Separate competitions for men and women, specially talent, senior officers and retired employees will be conducted.  It includes tug of war, chess, volleyball, caroms, ball badminton, football, table tennis, cricket, shuttle, tennis and other sports.  Along with the Parade Grounds, sports competitions will also be organized for the employees at the Recreation Hall, Srinivasa Sports Complex, SV Arts College Ground, SV Junior College, SV High School, SV University, SV Agriculture and Veterinary University grounds.

JEO Sri Veerabraham, DLO Sri Varaprasad Rao, CPRO Dr. T. Ravi, VGO Smt . Sadalakshmi, Welfare Officer Sri  Ananda Raju, Deputy EOs Sri. Govindarajan, Sri. Damodaram, Sri Devendra Babu, Sri Gunabhushan Reddy and many other senior officials and employees also participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు – టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు

•⁠ ⁠ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం

తిరుపతి, 2025, ఫిబ్రవరి 28: టిటిడిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిటిడి చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. టిటిడి ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారుకావాలని కోరారు. వచ్చే ఏడాదికి యువతతో పటిష్ట టీంలను తయారు చేయాలని సూచించారు. ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. టిటిడి ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, వారి మాన‌సిక వికాసం కోసం 1977వ సంవ‌త్స‌రం నుండి ప్ర‌తి సంవ‌త్స‌రం ఉద్యోగుల‌కు క్రీడాపోటీలు నిర్వ‌హించడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు శుక్ర‌వారం తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ప‌రేడ్ మైదానంలో ప్రారంభమ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు ఉద్యోగుల‌తో క్రీడాప్ర‌తిజ్ఞ చేయించారు. ముందుగా ఛైర్మ‌న్‌, ఈవో, అదనపు ఈవో, జేఈవో క‌లిసి క్రీడాప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. బెలూన్లు, శాంతి క‌పోతాల‌ను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు మార్చ్‌ఫాస్ట్ నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది భక్తులకు ఉద్యోగులు విశేషసేవలు అందిస్తున్నారని, ఈ నేపథ్యంలో పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని, వాటిని నియంత్రించడం క్రీడల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. టిటిడి ఉద్యోగులు సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతీ బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమిని విజయవంతం చేశారని అభినందించారు. టిటిడి ఉద్యోగులలో క్రీడా స్పూర్తి, స్నేహపూర్వక వాతావరణం, సమిష్టి కృషి, మనోదైర్యం కోసం క్రీడలు చాలా ఉపయోగపడతాయన్నారు. ప్రతి రోజు ఉద్యోగులు క్రీడలలో భాగస్వాములు కావడం మూలంగా వారిలో క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, శారీరక పటుత్వం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొనాలని సూచించారు. ఈ పోటీల్లో మొద‌టి స్థానం గెలుచుకున్న వారికి రూ.2వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.1800/-, మూడో స్థానంలో నిలిచిన‌వారికి రూ.1600/- విలువగ‌ల బ్యాంకు గిఫ్ట్‌కార్డులు బ‌హుమ‌తులు అంద‌జేస్తామ‌న్నారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వృత్తిలో మెరుగైన, ఉత్పాదక సేవలు అందించాలని కోరారు. గ్రీకుల కాలం నుండి క్రీడలకు ప్రాముఖ్యత ఉందన్నారు. దేశ విదేశాల్లో క్రీడలు భాగంగా ఉన్నాయన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. క్రీడ‌ల‌తో శారీర‌క దారుఢ్యంతోపాటు పున‌రుత్తేజం క‌లుగుతుంద‌ని చెప్పారు. టిటిడిలో ప్రతి ఒక్కరూ ఒత్తిళ్లను నియంత్రించుకుని, భావోద్వేకానికి గురికాకుండా క్రీడా స్పూర్తితో భక్తులకు మరింతగా సేవలు అందించాలని సూచించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్‌, ఈవో, అదనపు ఈవో, జేఈవో క్రీడ‌ల‌ను ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్‌ తదితర వివరాలు తెలియజేశారు. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు, ప్రత్యేక ప్రతిభావంతులకు, సీనియర్ అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పోటీలను నిర్వహిస్తారు. ఇందులో టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు ఉన్నాయి. పరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ మైదానం, ఎస్వీ జూనియర్ కాలేజీ, ఎస్వీ హైస్కూల్ ఎస్వీ యూనివర్శిటీ, ఎస్వీ అగ్రికల్చర్, వెటనరీ యూనివర్శిటీ మైదానాలలో ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, డీఎల్వో శ్రీ ఎ. వరప్రసాద్ రావు, సీపీఆర్వో డా.టి.ర‌వి, విజిఓ శ్రీమతి సదాలక్ష్మీ, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ ఎ. ఆనంద రాజు, డిప్యూటీ ఈవో లు శ్రీ గోవిందరాజన్, శ్రీ దామోదరం, శ్రీ దేవేంద్రబాబు, పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.