PROCESSION OF SWARNA RATHAM HELD _ స్వర్ణరథంపై కాంతులీనిన కల్యాణ శ్రీనివాసుడు

TIRUPATI, 23 FEBRUARY 2025: Sri Kalyana Venkateswara flanked by Sridevi and Bhudevi on His either sides paraded along the streets blessing devotees on Swarna Ratham between 4pm and 5pm in Srinivasa Mangapuram on Sunday.

The devotees, especially women folk, pulled the golden chariot with utmost devotion and enthusiasm chanting Govinda…Govinda…The entire area is filled with religious ecstasy.

Temple staff, engineering staff and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్వర్ణరథంపై కాంతులీనిన కల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి, 2025 ఫిబ్రవరి 23: శ్రీ‌నివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది.

శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ధగధగ మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు . వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం

వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.