SWARNA RATHOTSAVAM HELD _ స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి కటాక్షం

TIRUPATI, 16 February 2023: As part of the ongoing annual brahmotsavam at Srinivasa Mangapuram, Swarnarathotsavam held on Thursday evening between 4pm and 5pm.

Sri Kalyana Venkateswara flanked by Sridevi and Bhudevi on either sides atop Swarna Ratham blessed devotees.

Spl Gr DyEO Smt Varalakshmi, AEO Sri Gurumurty, Superintendents Sri Chengalrayalu, Sri Venkata Swamy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి కటాక్షం

తిరుపతి, 2023 ఫిబ్రవరి 16: శ్రీ‌నివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ధగధగ మెరుస్తున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారికి శ్రీభూదేవులు ఇరువైపుల ఉంటారు. శ్రీదేవి(లక్ష్మి) బంగారు. స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహాశక్తిమంతమైన లోహం. శ్రీవారి ఇల్లు, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు బంగారం. సింహాసనం బంగామే. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది.

ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని విశ్వాసం .

ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ వెంకట స్వామి, కంకణభట్టర్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.