SWARNA RATHAM PROCESSION HELD _ స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
TIRUPATI, 03 DECEMBER 2024: The procession of Swarnaratham held with religious ecstasy in Tiruchanoor on Tuesday evening.
Sri Padmavati Devi dazzled on the golden chariot decked in jewels and pattu vastrams to bless Her devotees along mada streets encircling the temple.
JEO Sri Veerabrahmam, SE3 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Govindarajan and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
తిరుపతి, 2024 డిసెంబరు 03: తిరుచానూరు శ్రీ ద్మావతి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆలయ మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది.
కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ, వజ్రాభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు. పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎస్ ఇ- 3 జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది