SWARNARATHAM PROCESSION HELD _ స్వర్ణరథం పై శ్రీ మహాలక్ష్మి కటాక్షం
TIRUPATI, 22 NOVEMBER 2025: Its a triple bonanza for devotees on Saturday as the Mother of Riches blessed devotees on three carriers.
In the morning Sri Padmavati Devi took out a celestial ride on Sarvabhoopala while in the evening on golden Chariot. Later in the night she will bless devotees on Garuda Vahanam.
All the top brass officials of TTD and temple staff were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
స్వర్ణరథంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం
తిరుపతి, 2025 నవంబరు 22: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆలయ మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది.
కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ, వజ్రాభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు. పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరేంద్రనాథ్, ఎస్ ఇ- 3 జగదీశ్వర్ రెడ్డి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది












