స్విమ్స్‌లో అన్నప్రసాద వితరణను పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
స్విమ్స్‌లో అన్నప్రసాద వితరణను పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2020 నవంబరు 12: తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌పేషంట్ రోగులకు, వారి సహాయకులకు టిటిడి అందిస్తున్న అన్నప్రసాదాలను జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి గురువారం పరిశీలించారు. పలువురు రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
అనంతరం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా శ్రీనివాసమంగాపురం, శ్రీవారి మెట్టు, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం వద్ద జరుగుతున్న చెత్త సేకరణ, తరలింపును తనిఖీ చేశారు. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తరువాత చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం ఆస్తులను పరిశీలించారు.
జెఈవో వెంట డెప్యూటీ ఈవో(క్యాంటీన్) శ్రీ లక్ష్మణ్ నాయక్, క్యాటరింగ్ అధికారి శ్రీ సాయిబాబా రెడ్డి, యూనిట్ ఆఫీసర్ శ్రీ అమరనాథరెడ్డి తదితరులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.