TTD CHAIRMAN GIVES EX-GRATIA _ స్విమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులకు పరిహారం చెల్లించిన టిటిడి ఛైర్మన్

TIRUPATI, 11 JANUARY 2025: TTD Chairman Sri B R Naidu visited to see the critically and partially injured devotees who are undergoing medication at SVIMS superspecialty hospital on Saturday evening and paid them the cheque of ex-gratia.

Among the devotees, Smt Timmakka of Annamaiah District, Smt Eswaramma of Vizag were paid a cheque for Rs.5lakh each.

While among those who received Rs. 2 lakh cheque each consisted of Smt Narasamma, Sri Raghu, Sri Ganesh, Sri Venkatesh, Sri Chinna Appayya of Annamaiah district.

Earlier a meeting was held wherein the legislators of Chandragiri Sri Nani, Sri Sudheer Reddy of Sri Kala Hasti, Sri Bhanuprakash Reddy of Nagari were also present.

Among officers, TTD JEO Sri Veerabrahmam, Collector Sri Venkateswar, SVIMS Director Dr RV Kumar were present.

While distributing the cheques, board members Sri Bhanuprakash Reddy, Sri Shantaram, SVIMS Medical Superintendent Dr Ram and other public representatives were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్విమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులకు పరిహారం చెల్లించిన టిటిడి ఛైర్మన్

తిరుపతి 2025, జనవరి 11: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీలో 8వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ లో 7 మంది బాధితులకు శనివారం పరిహారాన్ని టిటిడి ఛైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడు అందజేశారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందజేస్తున్నామన్నారు.

స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ జరిగిన సమావేశంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే శ్రీ గాలి భాను ప్రకాష్, టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, స్విమ్స్ డైరెక్టర్ డా.ఆర్వీ కుమార్ ల సమక్షంలో చెక్ లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జనవరి 8వ తేదీన జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన సర్వశ్రీ ఎస్.తిమ్మక్క కు రూ.5 లక్షలు, విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంకు చెందిన పి.ఈశ్వరమ్మ లకు రూ.5 లక్షలు చొప్పున పరిహారాన్ని టిటిడి ఛైర్మన్ అందజేశారు.

అదేవిధంగా గాయాలైన మరో 5 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున పరిహారాన్ని అందజేశారు. పరిహారం అందిన వారిలో అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన సర్వశ్రీ 1. కె. నరసమ్మ, 2.పి.రఘు,3. కె.గణేష్, 4.పి.వెంకటేష్, 5. చిన్న అప్పయ్య ఉన్నారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ మృతిచెందిన ఆరుగురు కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు టిటిడి పాలకమండలిలోని కొంత మంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

విశాఖ, నర్సీపట్నం సందర్శించే బృందంలో పాలకమండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ జంగా కృష్ణ మూర్తి, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి జానకీ దేవి, శ్రీ మహేందర్ రెడ్డి, శ్రీ ఎం.ఎస్ రాజు, శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి ఉండగా, తమిళనాడు, కేరళ బోర్డర్ సందర్శించే కమిటీలో శ్రీ రామమూర్తి, శ్రీ కృష్ణ మూర్తి, శ్రీ వైద్య నాథన్, శ్రీ నరేష్ కుమార్, శ్రీ శాంతా రామ్, శ్రీమతి సుచిత్రా ఎల్లా ఉన్నారని తెలిపారు.

మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు నియమించిన రెండు కమిటీలకు సంబంధించి రవాణా తదితర ఖర్చులను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు సొంత నిధులు నుండి చెల్లించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ శాంతారామ్ , స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్ , పలువురు టిటిడి, స్విమ్స్ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది